సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ -Sustainable Development and Environmental Protection Model Questions:

సుస్థిరాభివృద్ధిపర్యావరణ పరిరక్షణ Model Questions:

Join Whatsapp here for more updates of AP Grama Sachivalayam Exam

పర్యావరణం మాదిరి ప్రశ్నలు

 1. 1992లో’ధరిత్రిసదస్సు’ ఏ నగరంలో జరిగింది?

జ:రియోడి జనీరియో

 1. ‘ప్రపంచపర్యావరణదినోత్సవం’ ఏ రోజున నిర్వహిస్తారు?

జ: జూన్ 5

 1. 1945ఆగస్టు6, 9 తేదీల్లో హిరోషిమా, నాగసాకిలపై ఏ దేశం అణుబాంబులను వేసింది?

జ: అమెరికా


 1. కిందివాటిలో ఏవి క్లోరోఫ్లోరోకార్బన్(సీఎఫ్‌సీ)లను విడుదల చేస్తాయి?

ఎ) రిఫ్రిజిరేటర్లు బి) వ్యర్థ పదార్థాలు సి) సూర్యరశ్మి డి) టెలివిజన్

జ: ఎ(రిఫ్రిజిరేటర్లు)

 1. వీటిలోవాతావరణాన్ని కలుషితం చేస్తున్న హరిత గృహ వాయువు / వాయువులు ఏది? / ఏవి?
 2. i)కార్బన్‌డై ఆక్సైడ్ ii) కార్బన్‌మోనాక్సైడ్

ఎ) i మాత్రమే బి) ii మాత్రమే సి) i, ii డి) ఏదీకాదు

జ: సి( i, ii )

 1. గ్రీన్‌పీస్,ఎర్త్‌లాండ్, ఎర్త్ఫస్ట్ అనేవి …… ?

జ: పర్యావరణ సంఘాలు

 1. 1962లోపర్యావరణంకోసం ‘నిశబ్ద వసంతం’ రాసిన గ్రంథకర్త ఎవరు?

జ: రేచెల్ కార్సన్

 1. 1970లోపర్యావరణాన్నిరక్షించేందుకు ఏ దేశ పార్లమెంటు చట్టాలు చేసింది?

జ: అమెరికా

 1. ‘గ్రీన్‌పీస్’స్థావరాన్నిఎక్కడ ఏర్పాటు చేశారు?

జ: అంటార్కిటికా

 1. అంతర్జాతీయపర్యావరణ మొదటి సదస్సు ఎప్పుడు జరిగింది?

జ: 1972

 1. అంతర్జాతీయపర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది?

జ: స్టాక్‌హోం

 1. 1970లోఅణ్యాయుధపరీక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది?

జ: గ్రీన్‌పీస్

 1. పర్యావరణప్రత్యేక సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణ ఎప్పుడు మొదలైంది?

జ: 1980

 1. ప్రపంచ’ఓజోన్ దినం’ ఎప్పుడు?

జ: సెప్టెంబరు 16

 1. కిందివాటిలో’గ్లోబల్ వార్మింగ్’ ఫలితం?

ఎ) శీతోష్ణస్థితిలో మార్పు బి) జలమార్పు సి) మానవ మార్పు డి) పైవన్నీ

జ: ఎ(శీతోష్ణస్థితిలో మార్పు)

———————————————————————–

పర్యావరణ అంశాలు మాదిరి ప్రశ్నలు

 1. ప్రపంచవిపత్తుల్లో భూకంపాలు, సునామీల భాగం ఎంత?

జ: 8%

Sustainable Development and Environmental Protection Model Questions
Sustainable Development and Environmental Protection Model Questions
 1. భూకంపంఅనేది?

జ: వేగంగా జరిగే విపత్తు

 1. భారతదేశమొత్తం విపత్తుల్లో భూకంపాల భాగం ఎంత?

జ: 11%

 1. భూకంపంఒక …….

జ: భౌగోళిక వైపరీత్యం

 1. భూకంపాలనుంచి ఉత్పత్తి అయ్యేవి?

జ: ప్రకంపనాలు

 1. సిస్మోగ్రాఫ్కుమొదట చేరే తరంగాలు?

జ: P తరంగాలు

 1. కిందిఏ దేశంలో భూకంపాలు ఎక్కువ సంభవిస్తాయి?

జ: ఆస్ట్రేలియా

 1. డిజాస్టర్స్మిటిగేషన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?

జ: అహ్మదాబాద్

 1. భూకంపాలుఎక్కువగా సంభవించే ప్రాంతం?

జ: పసిఫిక్ మహాసముద్రం చుట్టూ

 1. పెద్దభూకంపాలు మన దేశంలో కింది ఏ ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి?

జ: ఈశాన్య రాష్ట్రాలు

 1. కిందిఏ తరంగాలను – చీల్చే తరంగాలు అంటారు?

జ: S తరంగాలు

 1. భారత్భూభాగంలో ఎంత శాతం భూకంపాలకు అనుకూలంగా ఉంది?

జ: 58.6%

 1. భూకంపదుర్బలత్వ మ్యాప్ ఆధారంగా కింది ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి?

జ: శ్రీనగర్

 1. భూకంపాలుఏర్పడటానికి అవకాశం ఉన్న ప్రాంతాలను ఏమంటారు?

ఎ) భ్రంశ మండలాలు బి) అధికేంద్రాలు

సి) రంధ్ర మండలాలు డి) పైవన్నీ

 1. భారతదేశంలోఅర్బన్ ఎర్త్‌క్వేక్ వల్నరబులిటీ రిడక్షన్ ప్రాజెక్టుని కింది ఏ సంస్థలు నిర్వహిస్తున్నాయి?

జ: భారత ప్రభుత్వం

 1. అంతర్జాతీయభూకంప పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

జ: లండన్

 1. భూకంపాలజోన్లో దృఢమైన ఇల్లు కట్టకోవడాన్ని ఏమంటారు?

జ: నిర్మాణాత్మక చర్య


Join Whatsapp for more updates of AP Grama Sachivalayam Exam

పర్యావరణ సంక్షోభం మాదిరి ప్రశ్నలు

ఏ కార్ల కంపెనీలో పర్యావరణ క్షీణతకు దారితీసే వాయువులున్నాయనే అంశం ఇటీవల వార్తాల్లోకి వచ్చింది?

ఎ) స్కోడా బి) వోక్స్వ్యాగన్ సి) మారుతి డి) టాటా

జ:(బి)

 1. భారతప్రభుత్వం జాతీయ అటవీ తీర్మానాన్ని ఏ సంవత్సరంలో చేసింది?

ఎ) 1952 బి) 1953 సి) 1962 డి) 1963

జ: (ఎ)

 1. ‘బోదకాలు’వ్యాధిదేని వల్ల వ్యాప్తి చెందుతుంది?

ఎ) నీరు బి) పందులు సి) దోమలు డి) గాలి

జ: (సి)

 1. కిందివాటిలోసజాతి ఆవరణం కానిది ఏది?

ఎ) ట్రోపో బి) స్ట్రాటో సి) మీసో డి) థర్మో

జ: (డి)

 1. కిందిఏ ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది?

ఎ) స్ట్రాటో బి) ట్రోపో సి) మీసో డి) ఎక్సో

జ: (ఎ)

విపత్తు – నిర్వహణ

 1. అంతర్జాతీయవిపత్తు కుదింపు మూడో సదస్సు ఎక్కడ జరిగింది?

జ: 2015 మార్చి – సెండాయ్

 1. కిందివాటినిజతపరచండి.

వాయువు              అంశం/ప్రభావం

 1. i)మిథైల్ఐసోసైనేట్
 2. a)జైవికవ్యవస్థ
 3. ii)ఏజెంట్ఆరెంజ్
 4. b)కిరణధార్మిక

iii) రేడియో తరంగాలు          c) రసాయనిక

 1. iv)మైకోటాక్సిన్స్
 2. d)పారిశ్రామిక

       i    ii   iii   iv

జ:  d   c     b    a

 1. రాస్టార్,వెక్టార్ నమూనాలు ఎందులో భాగాలు?

జ: భౌగోళిక సమాచార వ్యవస్థ

 1. నేషనల్రిమోట్ సెన్సింగ్ సెంటర్ భూతల కేంద్రం (Earth Station) ఎక్కడ ఉంది?

జ: షాద్‌నగర్

 1. కిందివాటిలోసుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది?

1) పేదరికం, ఆకలిని నిర్మూలించడం             2) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించడం

     3) క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం     4) లింగ సమానత్వం, మహిళా సాధికారత

జ: 3 (క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం)

 1. గ్రీన్పీస్ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా జరిగింది?

జ: అణు వ్యతిరేకత

 1. కిందివాటిలో జల కాలుష్యం  వల్ల రాని వ్యాధి?

     1) కలరా      2) కామెర్లు      3) మలేరియా      4) డయేరియా

జ: 3 (మలేరియా)

 1. కిందివాటినిఆరోహణ క్రమంలో అమర్చండి.

     1) జాతీయ హరిత ట్రైబ్యునల్      2) జీవ వైవిధ్య చట్టం

     3) జాతీయ వన్యప్రాణి చట్టం        4) జల కాలుష్య నియంత్రణ చట్టం

జ: 3421

 1. పర్యావరణంపైభారత పార్లమెంట్ చేసిన చట్టాల్లో సరికానిది.

     1) పర్యావరణ పరిరక్షణ చట్టం – 1986                 2) బయోస్ఫియర్ చట్టం – 1988

     3) వాయు కాలుష్య నియంత్రణ చట్టం – 1981      4) హాట్‌స్పాట్ చట్టం – 2006

జ: 2 (బయోస్ఫియర్ చట్టం – 1988)

 1. కిందివాటిలోసరైంది?
 2. a)క్యోటోప్రోటోకాల్ ఒప్పందం వాతావరణ మార్పునకు సంబంధించింది.
 3. b) మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ తరుగుదలకు సంబంధించింది.

జ: a, b సరైనవి

 1. కిందివాటిలోసరికానిది?

     1) అంతర్జాతీయ సునామీ దినోత్సవం – నవంబరు 5     2) అంతర్జాతీయ అటవీ దినోత్సవం – మార్చి 20

     3) అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం – ఏప్రిల్ 22             4) అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం – మే 22

జ: 2 (అంతర్జాతీయ అటవీ దినోత్సవం – మార్చి 20)

 1. కిందివాటినిజతపరచండి.

సమావేశం             వేదిక

 1. i)ఓజోన్తగ్గుదల సదస్సు
 2. a)న్యూదిల్లీ
 3. ii)అంతర్జాతీయసౌర కూటమి సదస్సు             b) కిగాలి

iii) COP – 24 సదస్సు          c) న్యూయార్క్

 1. iv)సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు   d) కెటోవీస్
 2.  e) పారిస్

జ: i-,b ii-a, iii-d, iv-c

 1. కిందివాటిలోసరైంది ఏది?

1) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2015 – 30 వరకు వర్తిసాయి

     2) SDG లో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి

     3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2015, సెప్టెంబరు 25న ఆమోదించారు

జ: 1, 2, 3 సరైనవి

 1. అప్పికోఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?

జ: కర్ణాటక

 1. కిందివాటిలోపర్యావరణ ఉద్యమాలకు సంబంధించి సరికానిది?

     1) క్షిపణులకు వ్యతిరేకంగా బాలియాపాల్ ఉద్యమం జరిగింది.

     2) మేధాపాట్కర్ ‘నర్మద బచావో’ ఆందోళన చేపట్టారు.

     3) ఝార్ఖండ్‌లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జంగిల్ బచావో ఉద్యమం జరిగింది.

     4) యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శబ్ద లోయలో  జరిగింది.

జ: 4 (యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శబ్ద లోయలో జరిగింది.)

 1. కిందివాటినిజతపరచండి.
 2. i)ధరిత్రీసదస్సు    a) జోహెన్నస్ బర్గ్ – 2002
 3. ii)పర్యావరణసదస్సు          b) హైదరాబాద్ – 2012

iii) జీవవైవిధ్య సదస్సు         c) స్టాక్‌హోం – 1972

 1. iv)సుస్థిరాభివృద్ధిసదస్సు  d) రియో – 1992

      i   ii   iii   iv

జ: d   c    b    a

 1. జీవావరణపిరమిడ్లో మొదటి మెట్టులో ఉన్నదెవరు?

జ: ఉత్పత్తిదారులు

 1. కిందివాటిలోజాతీయ విపత్తు నిర్వహణ సపోర్ట్ ప్రోగ్రాంను నిర్వహించేది?

     1) ISRO      2) GIS      3) NRSA      4) NGRI

జ: 3 (NRSA)

 1. క్యోటోప్రోటోకాల్ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

జ: 2005, ఫిబ్రవరి 16

 1. జాతీయకార్యాచరణ ప్రణాళిక వాతావరణ మార్పు కోసం 2016 డిసెంబరులో ఎన్ని జాతీయ ప్రణాళికలను అమలుపరిచింది?

జ: 8

 1. కిందివాటిలోసరైనవి గుర్తించండి.

     1) 2016 కరవు నిర్వహణ కరదీపిక దీర్ఘకాలిక కరవు 33% ఉన్నట్లు పేర్కొంది.

     2) కరవు పీడిత ప్రాంతం కింద 35% ఉన్నట్లు పేర్కొంది.

     3) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించినట్లయితే దాన్ని వాతావరణ కరవు అంటారు.

జ: 1, 2, 3 సరైనవి

 1. కిందివాటినిజతపరచండి.

అంశం     శాతం

 1. i)కరవుప్రభావం   a) 10%
 2. ii)వరదప్రభావం   b) 59%

iii) భూకంప ప్రభావం

 1. iv)తుపాన్లప్రభావం              c) 12%
 2. d) 68%
 3. e) 15%

      i   ii   iii   iv

జ: d   c    b    a

 1. నైలోమీటర్సాధనాన్ని దేన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు?

జ: వరదలు

 1. కిందివాటిలోఉష్ణ మండల చక్రవాత వర్గీకరణ వేగానికి సంబంధించి సరికానిది.

1) తుపాన్ స్ట్రోమ్ : 62 – 88 కేఎంపీహెచ్         2) వాయుగుండం : 31 – 49 కేఎంపీహెచ్

     3) అల్పపీడన ద్రోణి : 50 – 61 కేఎంపీహెచ్      4) సూపర్ సైక్లోన్ : 221 కేఎంపీహెచ్ పైన

జ: 3 (అల్పపీడన ద్రోణి : 50 – 61 కేఎంపీహెచ్)

 1. కొరియాలీస్ఎఫెక్ట్ ప్రకారం చక్రవాతాల గమనానికి సంబంధించి సరైంది.

     1) ఉత్తరార్ధ గోళంలో చక్రవాతాలు సవ్య పద్ధతిలో వీస్తాయి.

     2) దక్షిణార్ధ గోళంలో అపసవ్య పద్ధతిలో వీస్తాయి.

జ: 1, 2 రెండూ సరైనవికావు

 1. కిందివాటిలోసరైంది ఏది?

       1) హజార్డ్ అనే పదం అరబిక్ భాష నుంచి వచ్చింది.

       2) డిజాస్టర్ అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి ఆవిర్భవించింది.

జ: 1, 2 సరైనవి

 1. కిందివాటిలోప్రకృతి విపత్తుల్లో భాగం కానిది?

1) హిమపాతాలు       2) ఉరుములు, పిడుగులు      3) వన నిర్మూలన      4) ఉష్ణశీతల గాలులు

జ: 3 (వన నిర్మూలన)

 1. ప్రస్తుతందేశంలోని ఎన్ని రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయి?

జ: 27

 1. భారతదేశంలోభౌగోళికంగా కరవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయి?

జ: పశ్చిమ – దక్షిణ భారత్

 1. విపత్తుసంభవించినప్పుడు అవసరమైనవి?

       1) అత్యవసర స్పందన, సహాయం        2) పునరావసం, పునర్నిర్మాణం

       3) సంసిద్ధత                                       4) అన్నీ

జ: 4 (అన్నీ)

 1. కిందివాటిలోసరికానిది.

       1) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (NDRF) విపత్తు చట్టం సెక్షన్ 44 ప్రకారం ఏర్పాటు చేస్తారు.

       2) NDRF కేంద్ర హోంమంత్రి నిర్వహణలో ఉంటుంది.

       3) NDRF లో ప్రస్తుతం 12 బెటాలియన్లు ఉన్నాయి.

       4) ప్రస్తుతం 10వ CRPF బెటాలియన్ విజయవాడలో ఉంది. 4

జ:  4

 1. ప్రపంచంలోసంభవించే వైపరీత్యాల్లో కిందివాటిలో సరికానిది?

1) భూకంపాల వల్ల 8% నష్టం కలుగుతుంది         2) వరదల వల్ల 30% నష్టం కలుగుతుంది

       3) చక్రవాతాల వల్ల 21% నష్టం కలుగుతుంది.       4) కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.

జ: 4 (కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.)

 1. ఏదైనాభౌగోళిక ప్రాంతంలో లేదా ఒక కమ్యూనిటీలో సంభవించే వైపరీత్యాల వల్ల జరిగే నష్ట తీవ్రత, పరిధి, పరిస్థితులు దేనికి దారితీస్తాయి?

జ: దుర్బలత్వం

 1. 1999,ఆగస్టు20న విపత్తు నిర్వహణపై అత్యున్నతాధికార కమిటీని ఎవరి అధ్యక్షతన వేశారు?

జ: జె.సి. పంత్

 1. విపత్తుతీవ్రతను సాధారణంగా దేన్ని బట్టి అంచనా వేస్తారు?

జ: ప్రాణ, ఆస్తి నష్టం

 1. కిందివాటిలోవిపత్తులు, వాటి నోడల్ మంత్రి బాధ్యతలను జతపరచండి.

      విపత్తు              మంత్రి

 1. i)పరిశ్రమలు- రసాయనాలు              A) హోంమంత్రి
 2. ii)హిమపాతాలు B) వ్యవసాయ మంత్రి

iii) కరవులు           C) రక్షణ మంత్రి

 1. iv) NDRFD) పర్యావరణ – అటవీ మంత్రి
 2.  E) పరిశ్రమల మంత్రి

      i     ii   iii   iv

జ: D   C    B   A

 1. కిందిఅంశాల్లో సరైన వాటిని గుర్తించండి.

1) జాతీయ విపత్తు నిర్వహణ మొదటి సమావేశం న్యూదిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 2006, నవంబరు 29న జరిగింది.

2) జాతీయ విపత్తు నిర్వహణ సమావేశాలకు ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు.

జ: 1, 2 సరైనవి

 1. కిందివాటినిజతపరచండి.

      కమిటీ               ఛైర్పర్సన్

 1. i)కేబినెట్కమిటీ
 2. A)కేంద్రహోంమంత్రి
 3. ii)జాతీయసంక్షోభ నిర్వహణ కమిటీ B) హోం కార్యదర్శి

iii) జాతీయ కార్యనిర్వహణ కమిటీ     C) కేబినెట్ కార్యదర్శి

 1. iv)విపత్తుసమన్వయ కమిటీ            D) ప్రధానమంత్రి

      i    ii    iii   iv

జ: D   C    B    A

 1. అంతర్జాతీయవిపత్తు తగ్గింపు మూడో సదస్సు 2015, మార్చి 18న ఎక్కడ జరిగింది?

జ: సెండాయ్

 1. నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) ను 2016, జూన్ 1న న్యూదిల్లీలో ఎవరు విడుదల చేశారు?

జ: ప్రధానమంత్రి

 1. కిందివాటినిజతపరచండి.

         సంస్థ              కార్యాలయం

 1. i)అంతర్జాతీయవిపత్తు తగ్గింపు సంస్థ                A) బ్యాంకాక్
 2. ii)ఆసియావిపత్తు ప్రతిస్పందన సంస్థ               B) జెనీవా

iii) సార్క్ విపత్తు తగ్గింపు సంస్థ

 1. C)నాగ్‌పుర్
 2. iv)నేషనల్సివిల్ డిఫెన్స్ కాలేజీ
 3. D)దిల్లీ
 4.  E) పుణె

      i    ii   iii   iv

జ: B   A   D   C

 1. కిందిఅంశాల్లో సరైనవాటిని గుర్తించండి.

       1) అంతర్జాతీయ సునామీ అవగాహన దినోత్సవం – నవంబరు 5

       2) జాతీయ విపత్తు అవగాహన దినోత్సవం – అక్టోబరు 29

       3) అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం – 1990 – 2000

జ: 1, 2, 3

 1. దీర్ఘకాలిక విపత్తు ప్రణాళిక అభివృద్ధిని ఏ రకమైన విపత్తు స్థాయిలో సూచిస్తారు?

జ: L3

 1. ‘జాతీయవిపత్తునిర్వహణ ప్రణాళిక’ (NDMP)లో మొత్తం ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి?

జ: 14

 1. కిందిఅంశాల్లో సరైనవి.

1) విపత్తు సహాయ నిధిని ఏర్పాటుచేయాలని 9వ ఆర్థిక సంఘం మొదట సిఫారసు చేసింది.

     2) 13వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు జాతీయ విపత్తు సహాయక నిధిని 2010, ఏప్రిల్ 1న ప్రారంభించారు.

     3) 14వ ఆర్థిక సంఘం 2015-20కి గాను ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,489 కోట్లను సిఫారసు చేసింది.

జ: 1, 2, 3

Join Whatsapp here for more updates of AP Grama Sachivalayam Exam

Sustainability సుస్థిరాభివృద్ధి – వనరులు

 1. ఐక్యరాజ్యసమితి ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దం’ను ఎప్పుడు ప్రకటించింది? (డిప్యూటీ సర్వేయర్, 2017)

జ: 2005 – 2015

 1. ‘ఎజెండా- 21’దేనికి సంబంధించింది? (డీఎల్, 2017)

జ: సుస్థిరాభివృద్ధి

 1. కిందివాటిలోసుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది? (గ్రూప్ – 3, 2017)

     1) పేదరిక నిర్మూలన                2) ప్రపంచశాంతి, న్యాయాన్ని కాపాడటం

     3) అందరికీ నాణ్యమైన విద్య      4) క్రీడా నైపుణ్యాలను పెంచడం

జ: 4 (క్రీడా నైపుణ్యాలను పెంచడం)

 1. 2015న్యూయార్క్సాధారణ సభలో ఐక్యరాజ్య సమితి మొత్తం ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది? (ఏఈ, 2016)

జ: 17

 1. యూఎన్వోసాధారణ సభ 2015 సెప్టెంబరులో నిర్వహించిన 70వ సదస్సులో ఏ తీర్మానాన్ని ప్రకటించింది? (గురుకుల పీజీటీ, 2018)

జ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

 1. సుస్థిరాభివృద్ధిపైమొదటి సదస్సును ఎక్కడ నిర్వహించారు?

జ: జోహన్నెస్ బర్గ్

అంతర్జాతీయ పర్యావరణ రక్షణ చట్టాలు

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

 1. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం దేనికి సంబంధించింది? (ఏఈ, 2015)

జ: వాతావరణ మార్పు

 1. క్యోటోప్రోటోకాల్ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (ఏఈఈ, 2016)

జ: 2005, ఫిబ్రవరి 16

 1. 2022నాటికిభారతదేశం ఎన్ని గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది? (గ్రూప్ – 1, 2017)

జ: 100

 1. అంతరించిపోతున్నజీవులను లెక్కించడానికి ఉపయోగించే పుస్తకం (ఎస్ఐ, 2016)

జ: రెడ్‌లిస్ట్

 1. అంతర్జాతీయమొదటి పృథ్వి సదస్సును ఎప్పుడు నిర్వహించారు? (ఎస్ఏ, 2018)

జ: 1992

 1. కిందివాటినిజతపరచండి.

జాబితా – I                                                                జాబితా-II

 1. i)పర్యావరణదినోత్సవం                                           A) సెప్టెంబర్ 16
 2. ii)జీవవైవిధ్యదినోత్సవం B) ఏప్రిల్ 22

iii) ధరిత్రి దినోత్సవం                                                C) మే 22

 1. iv)ఓజోన్దినోత్సవం D) జూన్ 5

      i     ii     iii   iv

జ: D   C     B     A

 1. కిందివాటినిజతపరచండి.

   సదస్సులు                                                           సంవత్సరం

 1. i)క్యోటోప్రోటోకాల్ ఒప్పందం                           A) 1987
 2. ii)మాంట్రియల్ప్రోటోకాల్                               B) 1997

iii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు                        C) 2016

 1. iv)ఓజోన్ తరుగుదల సదస్సు D) 2018

      i        ii       iii       iv

జ: B      A       D        C

 1. కార్బన్పైట్యాక్స్ విధించిన మొదటి దేశం

జ: న్యూజిలాండ్

 1. UNEPనివిస్తరించండి.

జ: United Nations Environment Programme

 1. మొదటిఅంతర్జాతీయ పర్యావరణ సదస్సును ఎక్కడ నిర్వహించారు?

జ: స్టాక్‌హోం

జీవ వైవిధ్యం

 1. అత్యధికజీవ వైవిధ్యం కలిగి ఉన్న దేశం ఏది?

జ:బ్రెజిల్

 1. అత్యధికజీవ వైవిధ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?

జ: 16వ

 1. కిందివాటిలోజీవ వైవిధ్యానికి విఘాతం కలిగించే అంశం ఏది?

ఎ) ఆవాసాల వినాశనం      బి) అన్యజాతుల చొరబాటు      సి) సహజ వనరుల మితిమీరిన వాడకం    డి) అన్నీ

జ:డి (అన్నీ)

 1. హాట్స్పాట్లనుప్రతిపాదించింది ఎవరు?

జ: నార్మన్ మైర్స్

 1. భారతదేశంలోఉన్న హాట్స్పాట్లు ఎన్ని?

జ: 4

 1. కొత్తగాఆవిర్భవించి, ఒక ప్రాంతానికే పరిమితమైన జీవజాతులు చూపే స్థానీయత ఏది?

జ: నియో ఎండమిజమ్

కిందివాటిలో అతిపెద్ద జీవ వైవిధ్య స్థాయి ఏది?

ఎ) జన్యు వైవిధ్యం బి) జాతి వైవిధ్యం         సి) జీవావరణ వైవిధ్యం         డి) పైవేవీకాదు

జ: సి (జీవావరణ వైవిధ్యం)

 1. కిందివాటిలోజీవ వైవిధ్యం వల్ల కలిగే ప్రయోజనాలేవి?

ఎ) ఆహ్లాదపు ప్రయోజనాలు         బి) నైతిక ప్రయోజనాలు         సి) ఉత్పాదక ప్రయోజనాలు         డి) అన్నీ

జ: డి (అన్నీ)

 1. సక్యులెంట్కరూ ప్రాంతం ఏ మండలంలోని హాట్‌స్పాట్‌గా గుర్తించవచ్చు?

జ: ఆఫ్రికా

 1. కిందివాటిలోఅత్యధిక హాట్స్పాట్లున్న మండలం?

ఎ) ఆఫ్రికా         బి) ఆసియా పసిఫిక్         సి) యూరప్, మధ్య ఆసియా         డి) ఏదీ కాదు

జ: బి (ఆసియా పసిఫిక్)

 1. , ,లు వరుసగా ఆల్ఫా, బీటా, గామా వైవిధ్యాలను సూచిస్తే వీటి మధ్య సంబంధం ఏది?

జ: <<

 1. జీవవైవిధ్యం పదాన్ని రోసన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు?

జ:1985

కిందివాటిలో భారతదేశంలోకి ప్రవేశించిన అన్యదేశ జాతి మొక్కలేవి?

ఎ) కాంగ్రెస్ గ్రాస్       బి) లాంటనా        సి) ఐకార్నియా        డి) అన్నీ

జ: డి (అన్నీ)

 1. జీవవైవిధ్య సంపద ……

జ: భూమధ్య రేఖా ప్రాంతం వైపు వెళుతున్న కొద్దీ పెరుగుతుంది.

 1. కిందివాటిలోసుమారు 50% జీవ వైవిధ్య సంపదను కలిగి ఉంది …….

ఎ) ఉష్ణమండల వర్షారణ్యం        బి) సమశీతోష్ణ వర్షారణ్యం        సి) ప్రవాళ భిత్తికలు        డి) గడ్డి భూములు

జ: ఎ (ఉష్ణమండల వర్షారణ్యం)

పర్యావరణ క్షీణత విలువ లెక్కించడం

 1. పర్యావరణాన్నిఏవిధంగా నిర్వచించవచ్చు?

ఎ) ఒక నిర్ణీత ప్రదేశంలో, ఒక నిర్ణీత కాలంలో మానవుల చుట్టూ ఉన్న పరిస్థితుల మొత్తం.

బి) ఒకరి చుట్టూ ఉన్న పరిస్థితులు, వస్తువులు, నియమాలను కలిపి పర్యావరణం అంటారు.

సి) మనుషులతో పాటు అన్ని రకాలైన ప్రాణుల అభివృద్ధిని ప్రభావితం చేస్తూ, మార్పులకు గురిచేసే అన్నిరకాల నియమాలు, ప్రభావాలను కలిపి పర్యావరణం అంటారు.

డి) పైవన్నీ సరైనవే.

జ: డి (పైవన్నీ సరైనవే)

 1. కిందివాటినిజతపరచండి.
 2. భౌతికఅనుఘటకాలు     ఎ) జనాభా, ఆచారాలు, మానవ సంబంధాలు, పట్టణీకరణ
 3. జీవఅనుఘటకాలు         బి) సూర్యశక్తి, వాయుశక్తి, భూ ఉష్ణశక్తి, విద్యుదయస్కాంతశక్తి
 4. సాంఘికఅనుఘటకాలుసి) మొక్కలు, వృక్షాలు, జంతువులు
 5. శక్తిఅనుఘటకాలు          డి) భూమి, నీరు, గాలి, పర్వతాలు, అడవులు

జ: 1-డి, 2-సి, 3-ఎ, 4-బి.

 1. మార్కెట్వ్యవస్థకు బహిర్గత కారకమైన పర్యావరణ క్షీణత ఆర్థిక విలువ లెక్కించడం వల్ల …
 2. నాణ్యతకోల్పోయిన విభిన్న పర్యావరణ వనరులను గుర్తించవచ్చు.

2.కాలుష్యాల రుణాత్మక ప్రభావానికి గురైన వనరుల మధ్య భౌతిక సంబంధాన్ని లెక్కించవచ్చు.

 1. పర్యావరణక్షీణత వల్ల వ్యక్తులు, సంస్థలకు ఏర్పడిన నష్టంలో కొంతభాగం తగ్గించడానికి సూచనలు ఇవ్వొచ్చు.
 2. పర్యావరణవనరులకు జరిగిన భౌతిక నష్టానికి ద్రవ్య విలువ లెక్కించవచ్చు.

జ: 1, 2, 3, 4

 1. పునరావృతంకానివనరుల విషయంలో మన ఎంపిక ఏవిధంగా ఉండాలి?

     ఎ) పునఃచక్రీకరణ చేయడం        బి) ఎక్కువగా వృథా చేయకుండా ఉండటం

     సి) పొదుపుగా వాడుకోవడం      డి) అన్నీ

జ: డి (అన్నీ)

 1. పర్యావరణవనరుల క్షీణత అంచనాకు వ్యయ-ప్రయోజన పద్ధతిని సూచించింది ఎవరు?

జ: హిక్స్ – కాల్డార్

పర్యావరణ వనరుల పరిరక్షణ

 1. పర్యావరణంలో వచ్చే విభాగాలు ఏవి?
 2. వాతావరణం2. జలావరణం 3. ఆశ్మావరణం 4. జీవావరణం

జ: 1, 2, 3, 4

2.కిందివాటిలో జల ఆవరణ వ్యవస్థ (Acquatic Ecosystem) కు సంబంధించిన అంశాలేవి?

 1. సరస్సుఆవరణ వ్యవస్థ
 2. తడినేలఆవరణ వ్యవస్థ
 3. డెల్టాభూమి ఆవరణ వ్యవస్థ
 4. సముద్రనీటిఆవరణ వ్వవస్థ

జ: 1, 2, 3, 4

 1. కిందివాటిలోభౌమ ఆవరణ వ్యవస్థ (Terrestial Ecosystem) కానిది ఏది?

ఎ) ద్వీపాల ఆవరణ వ్యవస్థ

బి) పర్వత ఆవరణ వ్యవస్థ

సి) ఎడారి ఆవరణ వ్యవస్థ

డి) డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ

జ:  డి (డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ)

సహజవనరులకు ఉండాల్సిన లక్షణం?

ఎ) వనరుల నిల్వలు స్థిరంగా ఉండటం

బి) ప్రకృతి వనరుల నిల్వలను నిర్థారించడం

సి) సహజ, శారీరక లేదా జీవ రసాయన రేటుకు లోబడి వనరుల నిల్వలు మార్పుకి లోనవడం

డి) పైమూడింటిలో ఏ ఒక్క లక్షణమైనా

జ:  డి(పైమూడింటిలో ఏ ఒక్క లక్షణమైనా)

 1. కిందివెన్ చిత్రంలో ఏ భాగాన్ని ‘సుస్థిరమైన అభివృద్ధి’ భావనగా పేర్కొంటారు?

జ: b

కిందివాటిలో పునరుద్ధరించగల వనరులు (Renewable Resource) ఏవి?

 1. సూర్యకాంతి 2. ఆహార ఉత్పత్తి      3. భూగర్భ నీటి నిల్వలు     4. అటవీ సంపద

జ:  1, 2, 3, 4

 1. ఉత్పాదకవస్తువులు, ఉత్పత్తి వస్తువులకు సంబంధించి ‘భౌతిక సమతూక నమూనా’ను ప్రతిపాదించింది?

జ: అలెన్ నీస్ – ఆర్.వి. ఆయిర్స్

 1. గ్రీకులనమ్మకం ప్రకారం భూవనరులను దుర్వినియోగం చేసేవారిని శిక్షించే న్యాయదేవత?

జ: తిమిస్

 1. ‘Rent under the Assumption of Exhaustibility’పరిశోధనగ్రంథకర్త ఎవరు?

జ: ఎల్.సి. గ్రే (1914)

జ: మొదటి నిలకడగల వృద్ధి నియమం

ఎకానమీ – సుస్థిర అభివృద్ధి

1.’పర్యావరణాన్ని ఒక్క మానవజాతి మాత్రమే కలుషితం చేస్తోంది. జీవావరణ వ్యవస్థలో మానవజాతి ఒక్కటే సిగ్గుపడాల్సిన జాతి లేదా సిగ్గుపడటానికి కారణం కలిగి ఉంటుంది’ అని పేర్కొన్నది?

జ: మార్క్‌ట్వెయిన్

2.’భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి కానీ ఏ ఒక్కరి దోపిడీకి సరిపోవు’ అని పేర్కొన్నది ఎవరు?

జ: మహాత్మాగాంధీ

 1. ‘సహజవనరులుఅనంతంగా లభిస్తాయనే సంప్రదాయవాదం వీడి నేటి మానవుడు భూగోళాన్ని పరిమిత వ్యవస్థగా భావించాలి’ అని అభిప్రాయపడింది ఎవరు?

జ: కెన్నెత్ బౌల్డింగ్

 1. పర్యావరణం- ఆర్థిక వ్యవస్థల అనుబంధం దృష్ట్యా కిందివాటిలో సరైంది?

    ఎ) పర్యావరణం ఆర్థిక కార్యకలాపాలకు అవసరమైన ఉత్పాదితాలను అందిస్తుంది.

    బి) పర్యావరణం ఆర్థిక కార్యకలాపాల వల్ల ఏర్పడే వ్యర్థాలను విలీనం చేసుకుంటుంది.

    సి) ఎ, బి                                                                                                                 డి) పైవేవీ కాదు

జ: సి (ఎ, బి)

కిందివాటిలో పర్యావరణ విధి ఏమిటి?

ఎ) సహజ వనరులను అందించడం            బి) సౌలభ్యాలను అందించడం

    సి) వ్యర్థాలను విలీనం చేసుకోవడం             డి) పైవన్నీ

జ: డి (పైవన్నీ)

 1. సైమన్కుజ్నెట్స్ పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని కింది ఏ అంశాల ద్వారా వివరించాడు?
 2.  ఆర్థికాభివృద్ధి                 2. పర్యావరణం నాణ్యతా స్థాయి
 3.  పేదరికం స్థాయి             4. ఆదాయ వ్యత్యాసాల స్థాయి                5. జనసాంద్రత

జ: 1, 2, 3, 4, 5

 1. తిరగబడిన’U’ ఆకార రేఖ (Inverted ‘U’ shaped curve) ద్వారా తలసరి ఆదాయంలో పెరుగుదల, పర్యావరణ క్షయం మధ్య సంబంధాన్ని సూచించింది ఎవరు?

జ: సైమన్ కుజ్నెట్స్

 1. నిలకడగల ఆర్థికాభివృద్ధి (Sustainable development) భావన అంటే…?

  ఎ) పర్యావరణం ప్రజల జీవన ప్రమాణాలకు బహిర్గతంగా తోడ్పడటం.

  బి) నేటి ప్రజలు అనుభవిస్తున్న జీవన ప్రమాణాల స్థాయిని ఏ మాత్రం తగ్గకుండా భావితరాలకు అందించడం.

  సి) సహజ వనరులు, మానవ నిర్మిత వనరులతో కూడిన మూలధనం భావితరాలకు అందుబాటులో ఉండటం.

  డి) పైవన్నీ

జ: డి (పైవన్నీ)

పర్యావరణ పరిరక్షణ ద్వారా నిలకడ గల ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి?

 1. వనరులవాడకం తగ్గించడం (Reduce)
 2.  వ్యర్థాల నుంచి సాధ్యమైనంత ప్రయోజనం రాబట్టడం (Recover)
 3.  ప్రయోజనం కోల్పోకుండా తిరిగి ఉపయోగించగల వస్తువుల తయారీ (Recycle)
 4.  పునఃఉపయోగం, సాధ్యమైనన్నిసార్లు తిరిగి ఉపయోగించడం (Reuse)

జ: 1, 2, 3, 4

 1. నిలకడగల ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు ఏవి?
 2.  వృద్ధి లేదా ఆదాయాల్లో పెరుగుదల        2. అభివృద్ధి కొనసాగింపు
 3.  క్షీణత నియంత్రణ                                  4. జీవవైవిధ్య రక్షణ

జ: 1, 2, 3, 4

 1. హెచ్.డాలీ (1990 లో) కొనసాగించగలిగిన ఆర్థికాభివృద్ధికి తెలియజేసిన నియమాలు ఏవి?
 2. పునరుద్ధరించగలవనరులను పునఃకల్పన రేటుకు (Regeneration rate) మించి ఉపయోగించరాదు.
 3. పునరుద్ధరించడానికివీల్లేని వనరులు ప్రత్యామ్నాయ వనరులు లభించే రేటు కంటే ఎక్కువ రేటులో ఉపయోగించకూడదు.
 4. పర్యావరణంవిలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోకి విసర్జించరాదు.

జ: 1, 2, 3

ఉష్ణగతిక శాస్త్రం (Thermo Dynamics) మొదటి సూత్రం ఏమని తెలుపుతుంది?

జ: ఇంధనం (శక్తి) పరిమితి స్థిరంగా ఉంటుంది. దాన్ని సృష్టించడం లేదా విధ్వంసం చేయడం సాధ్యం కాదు.

13.ఆర్థిక కార్యకలాపాల పరిమాణం పెరిగేకొద్దీ నియమరహితం పెరిగి, ప్రయోజనకరమైన పదార్థాల లభ్యత తగ్గడం ద్వారా నాగరికతలు క్షీణించేలా ‘ఎంట్రోపి’ సూత్రం (ఉష్ణగతికశాస్త్రం రెండో సూత్రం) శపించిందని పేర్కొన్నది ఎవరు?

జ: జార్జెస్ క్యూ – రోజన్

 1. గ్రీకుదేశంలో ప్రకృతి వనరులను పునరుద్ధరించగల శక్తి కలిగి, పర్యావరణ సమతూకాన్ని నెలకొల్పే దేవతగా ఎవరిని విశ్వసిస్తారు?

జ: గైయా

 1. కాలుష్యంద్వారా కలిగే పర్యావరణ హానిని ‘సామాజిక వ్యయం (Social Cost)’ అన్నది ఎవరు?

జ: ఎ.సి. పిగూ

 1. 1914లోనే’హరించుకుపోయే వనరుల అభిలషణీయ వినియోగరేటు’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?

జ: ఎల్. గ్రే

 1. పర్యావరణంపైబ్రండ్ట్లాండ్ అధ్యక్షతన ‘ప్రపంచ సంఘం (World Commission on Environment and Development)’ ఎప్పుడు ఏర్పాటైంది?

జ: 1987

 1. బ్రండ్ట్లాండ్సంఘం(Brundtland Commission) సమర్పించిన నివేదిక పేరేంటి?

జ: మన ఉమ్మడి భవిష్యత్ (Our Common Future)

19.’భావితరాల ప్రజలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యంతో రాజీపడకుండా, వర్ధమాన తరం తన అభివృద్ధి అవసరాలను తీర్చుకోగలగడమే నిలకడ గల అభివృద్ధి (Sustainable development)’ అని నిర్వచించింది?

జ: బ్రండ్ట్లాండ్ కమిషన్

 1. ‘ఒకనిర్ణీతకాలంలో ప్రకృతి పర్యావరణ ఆస్తులతోసహా ముత్తాతల నాటి నుంచి లభించిన మొత్తం ఆస్తులను యథాస్థితిలో ఉంచగలిగేదే నిలకడ గల అభివృద్ధి’ అని నిర్వచించింది ఎవరు?

జ: జె.టి. విన్‌పెన్ని

 1. కిందివాటిలోనిలకడ గల అభివృద్ధిలోని అంతర్గత అంశాల్లో లేనిది ఏది?

    ఎ) ఆర్థికాంశాలు                         బి) సాంఘిక అంశాలు

    సి) పర్యావరణ అంశాలు              డి) రాజకీయ అంశాలు

జ: డి (రాజకీయ అంశాలు)

 1. ఆర్థికవ్యవస్థలో ఉండే మూలధనాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
 2.  భౌతిక మూలధనం (KM)       2. మానవ మూలధనం (KH)        3. ప్రకృతి వనరులు (KN)

జ: 1, 2, 3

 1. కాలక్రమేణాజాతీయమూలధన నిల్వ తరగకుండా ఉండే నేపథ్యంలో నిలకడ గల అభివృద్ధి సాధ్యమవుతుందనే ‘స్థిర మూలధన నిల్వ నియమాన్ని (Constant Capital Stock Rule)’ ప్రతిపాదించింది ఎవరు?

జ: పియర్స్

24.ఏ నియమాన్ని అతిబలహీన నిలకడ వృద్ధి లేదా సోలో నిలకడ వృద్ధి స్థితి అంటారు?

జ: రెండో నిలకడ గల వృద్ధి నియమం

 1. బలమైననిలకడ గల వృద్ధి నియమం ఏది?

జ: నాలుగో నిలకడ గల వృద్ధి నియమం

 1. బలమైననిలకడ గల వృద్ధి సాధించడానికి…

జ: ప్రకృతి మూలధనం నిల్వ స్థిరంగా ఉండాలి

 1. ‘జరిగేలాచూడటం(Making it happen)’ అనే పరిశోధనా వ్యాసంలో నిలకడ గల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందించింది ఎవరు?

జ: రాల్ఫ్ రూక్వుడ్

 1. రాల్ఫ్రూక్వుడ్ ప్రతిపాదనలకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?

ఎ) ప్రకృతి వనరుల దుర్వినియోగాన్ని విడనాడి వాటి పరిమితమైన స్థితిని గౌరవించాలి

బి) పర్యావరణానికి హానిచేసే అత్యున్నత ఆచరణలను కనుక్కుని వాటిని ప్రతికృతి (Replication) చేయాలి.

సి) నిలకడ గల అభివృద్ధి నియమాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దీర్ఘకాల ఉద్దేశాలను రూపొందించాలి.

డి) పర్యావరణ సహాయనిధిని ఏర్పాటు చేయాలి.

జ: బి (పర్యావరణానికి హానిచేసే అత్యున్నత ఆచరణలను కనుక్కుని వాటిని ప్రతికృతి (Replication) చేయాలి.)

 1. అపసరణనియమం(Law of Divergence) ప్రకారం….

జ: ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవవైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతం అంత ఎక్కువగా సంరక్షించబడుతుంది.

30.కాలుష్యం స్థాయిని సాంఘికంగా అభిలషణీయ స్థాయికి నియంత్రించడానికి, కాలుష్యం వల్ల సంఘానికి ఏర్పడుతున్న హానికి సమానంగా పన్నుల విధానాన్ని రూపొందించాలని ‘కాలుష్య పన్ను’ను ప్రతిపాదించింది ఎవరు?

జ: పిగూ

 1. సామాన్యులదుర్ఘటన (Tragedy of Commons) భావనను ప్రవేశపెట్టింది ఎవరు?

జ: విలియం ఫోస్టర్ లాయిడ్

 1. ఎన్విరాన్మెంట్(పర్యావరణం) అనే ఆంగ్ల పదం ‘ఎన్విరానర్’ అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది?

జ:  ఫ్రెంచి

 1. ఎన్విరాన్అనే పదానికి అర్థం…?

జ: చుట్టూ ఉన్న

 1. ‘భూమిఅనేదిఒక రోదసి నావలాంటిది. ఇందులో ప్రాణాధారమైన వనరులు పరిమితంగా ఉంటాయి. మానవ జాతి వీటి వినియోగాన్ని బాగా పెంచుకోవడానికి బదులుగా, వీలైనంతవరకు తగ్గించుకుంటే మంచిది’ అని హెచ్చరించింది ఎవరు?

జ: కెన్నెత్ బౌల్డింగ్

 1. ‘ఆవరణవ్యవస్థ(Eco System)’ అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది?

జ: ఎ.జి. టాన్స్లే

జీవవైవిధ్యం (Bio-Diversity) అనే పదాన్ని తొలిసారి ప్రతిపాదించింది ఎవరు?

జ: వాల్టర్ రోసెన్

 1. ‘సుస్థిరత్వం(Sustainability)’భావనను ప్రవేశపెట్టింది ఎవరు?

జ: ఐరోపా అటవీ అధికారులు

 1. కిందిఅంశాలను జతపరచండి.
 2. దిసైలెంట్ స్ప్రింగ్               a)) రాచెల్ కార్సన్ (1962)
 3. దికాస్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్            b) మిషాన్ (1967)
 4. లిమిట్స్టు గ్రోత్                c) మెడోస్ (1973)
 5. అవర్కామన్ ఫ్యూచర్     d) బ్రండ్ట్లాండ్ (1987)

జ: 1-a, 2-b, 3-c, 4-d

 1. కిందిఏ సంవత్సరంలో ‘ధరిత్రీ సదస్సు’ జరిగింది?

    ఎ) 1990       బి) 1991       సి) 1992      డి) 1993

జ: సి (1992)

 1. అమెరికా’సుస్థిరమైన అభివృద్ధి కోసం విద్యా దశకం’గా ఏ కాలాన్ని ప్రకటించింది?

జ: 2005 – 15

పర్యావరణ సంబంధ సమకాలీన అంశాలు

 1. ఇటీవలNABARD (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) కింది ఏ పర్యావరణ సంబంధ సంస్థతో ప్రధాన గుర్తింపు ఒప్పందం (AMA – Accreditation Master Agreement) పై సంతకం చేసింది?

జ: GCF – గ్రీన్ క్లైమేట్ ఫండ్

GCF కి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?

 1. i)దీన్నిదక్షిణ కొరియాలో స్థాపించారు.
 2. ii)దీన్నిUNFCC (United Nations Framework Convention on Climate Change) అధీనంలో ఉన్న సంస్థగా పేర్కొనవచ్చు.

iii) 2015లో అమల్లోకి వచ్చిన పారిస్ ఒప్పందానికి ఇది కేంద్ర బిందువు.

 1. iv)సుమారు24 మంది సభ్యులు ఉన్న ఒక బోర్డు అధీనంలో దీని పరిపాలన సాగుతుంది.
 2. v)అభివృద్ధిచెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులను నిరోధించడానికి దీన్ని స్థాపించారు.

జ: i, ii, iii, iv , v

 1. పులులసంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ డేని (Global Tiger or International Tiger day) సాధారణంగా ఏ రోజు నిర్వహిస్తారు?

జ: జులై 29

సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ కిందివాటిలో దేనికి సంబంధించింది?

ఎ) అంతరిస్తున్న పాముల సంరక్షణ, వాటి జనాభా పెంపుదల.

    బి) పులుల సంరక్షణ, 2022 నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడం.

    సి) ఖడ్గమృగాలను జాతీయ పార్కుల్లో సంరక్షించడం.

    డి) సింహాలను కొత్త ప్రదేశాలకు పంపి వాటి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.

జ: బి (పులుల సంరక్షణ, 2022 నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడం)

 1. సెయింట్‌పీటర్స్‌బర్గ్ పులుల సదస్సు (St. Peters Burg Tiger Summit) ఎప్పుడు జరిగింది?

జ: 2010

 1. 2017సంవత్సరానికిసంబంధించి ప్రపంచ పులుల దినోత్సవం ప్రధాన నినాదం ఏమిటి?

జ: పులుల సంరక్షణార్థం శుద్ధమైన ఆవరణ శాస్త్రం (Fresh Ecology for Tiger’s Protection)

 1. ‘వరల్డ్వైల్డ్లైఫ్ఫండ్’ గణాంకాల ఆధారంగా పులుల జనాభాకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?
 2. i) 1915నాటికిసుమారు ఒక లక్షగా ఉన్న పులుల సంఖ్య గడిచిన శతాబ్దంలో సుమారు 97 శాతం మేర నష్టానికి గురైంది.
 3. ii)ప్రస్తుతంపులులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో ఉంది. సుమారు 2,226 పులులు ఉన్నాయని అంచనా.

iii) గడిచిన కొన్ని దశాబ్దాలతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో పులుల సంఖ్యలో పెరుగుదల కొంత ఆశాజనకంగా ఉంది. iv) భారత్, బంగ్లాదేశ్ సంయుక్త భాగస్వామ్యంలో ఉన్న పెద్ద మడ అడవి సుందర్బన్ ప్రపంచంలోనే అత్యధికంగా పులులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది.

జ: i, ii, iii, iv

 1. కిందివాటిలోప్రపంచంలోనే మొదటి హరిత మెట్రో వ్యవస్థగా సంపూర్ణంగా తయారైన మెట్రో రైలు వ్యవస్థ ఏది?

    ఎ) న్యూయార్క్ మెట్రో రైల్వే కార్పొరేషన్ (NMRC)    బి) ఆస్ట్రేలియా మెట్రో రైల్ ప్రైవేట్ లిమిటెడ్ (AMRL)

    సి) దిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (DMRC)                డి) జపాన్ మెట్రో రైల్వే ఏజెన్సీ (JMRA)

జ: సి (దిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (DMRC))

 1. ఇటీవల’నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా’ ఏడు ప్రాజె క్టులను ఆమోదించింది. అయితే ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్’ గంగాకు సంబధించి కిందివాటిలో ఏది సత్యం?
 2. i) ఇది నేషనల్ గంగా కౌన్సిల్ కార్యశీలక శాఖ
 3. ii) దీన్ని 2011లో స్థాపించారు.

   iii) దీని నిర్వహణ శైలిలో పరిపాలన శాఖ, కార్యనిర్వాహక శాఖ అనే రెండంచెల వ్యవస్థ నిర్మాణం కనిపిస్తుంది.

జ: i, ii, iii

 1. దోహాసవరణ (Doha Amendment) కింది ఏ పర్యావరణ ఒప్పందానికి సంబంధించింది?

జ: క్యోటో ప్రోటోకాల్

క్యోటో ప్రోటోకాల్‌కు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలు?

 1. i)క్యోటోప్రోటోకాల్ మొదటి నిబద్ధతా సమయం 2008 నుంచి 2012 వరకు
 2. ii) క్యోటో ప్రోటోకాల్ ద్వితీయ నిబద్ధతా సమయం (Second Commitment) 2013 నుంచి 2020 వరకు

   iii) ఇది ఒక అంతర్జాతీయ హరిత గృహ ప్రభావ కారక వాయువుల ఉద్గార నియంత్రణా ఒప్పందం

 1. iv) ఇది 2005 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది

జ: i, ii, iii, iv

 1. నేషనల్గ్రీన్ ట్రైబ్యునల్ ఇటీవల ఏ నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న జీవక్షయం కాని ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మధ్యంతరంగా రద్దు చేసింది?

జ: దిల్లీ

 1. ప్రపంచఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

జ: ఆగస్టు 12

 1. 2017లోప్రపంచఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మన దేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి డా.హర్షవర్థన్ ప్రారంభించిన కార్యక్రమం?

జ: గజ యాత్ర

కింది వాయువుల్లో దేన్ని కాలుష్యకారకం కానిదిగా చెప్పవచ్చు?

ఎ) కార్బన్ డై ఆక్సైడ్       బి) పొగ       సి) సల్ఫర్ డై ఆక్సైడ్       డి) నైట్రోజన్

జ: డి (నైట్రోజన్)

 1. ఎడిన్బర్గ్విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత ప్రాంతాన్ని ఇటీవల ఆవిష్కరించారు. ఇది ఎక్కడ ఉంది?

జ: అంటార్కిటికా

 1. 2017లోనిర్వహించినఏనుగుల జనాభా గణనలోని అంశాల ఆధారంగా మన దేశంలో కింది ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఏనుగులు ఉన్నట్లు పేర్కొనవచ్చు?

జ: కర్ణాటక

 1. ఆవరణవ్యవస్థ సేవా అభివృద్ధి పథకం (Eco System Service Improvement Project) ను నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్‌లో భాగంగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏయే రాష్ట్రాల్లో ప్రారంభించనుంది?
 2. i) చత్తీస్‌గఢ్       ii) మధ్యప్రదేశ్       iii) గుజరాత్

జ: i, ii మాత్రమే

 1. గ్లోబల్ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది కింది ఏ సంస్థకు సంబంధించింది?

జ: ప్రపంచ బ్యాంకు (World Bank)

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న Eco System Service Improvement Project కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు?

జ: 5

21.గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ కిందివాటిలో దేనికి సంబంధించింది?

ఎ) సౌర, పవన, ఇతర పునరుద్ధరింపదగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌శక్తిని సమకాలీకరణం (Synchronisation) చేయడానికి నిర్దేశించింది.

బి) జీవ పునరుత్పత్తిని ప్రదర్శించే వనరుల ఉత్పత్తి, వినియోగానికి నిర్దేశించింది.

సి) పంటలు, పండ్ల వృక్షాల వ్యర్థ పదార్థాల నుంచి నవీన పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పాదన మెరుగుపరచడానికి

డి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాశ్చాత్య సాంకేతికతను ప్రవేశపెట్టడానికి నిర్దేశించింది.

జ: ఎ (సౌర, పవన, ఇతర పునరుద్ధరింపదగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌శక్తిని సమకాలీకరణం (Synchronisation) చేయడానికి నిర్దేశించింది)

 1. పర్యావరణసమతాస్థితి కొనసాగాలంటే భూమిపై ఉండాల్సిన అటవీ శాతం ఎంత?

జ: 33

 1. బయోస్ఫియర్రిజర్వ్ ప్రాజెక్ట్‌ను మన దేశంలో ఎప్పుడు ప్రారంభించారు?

జ: 1986

వృక్ష ప్లవకాలు (Phyto planktons) అనేవాటిని కింది ఏ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జాబితాలో చేర్చవచ్చు?

జ: జలావరణ వ్యవస్థ (Aquatic Eco – System)

25.పాదరసం వల్ల కలిగే మినామిటా వ్యాధిని (Minamita) మొదటిసారిగా ఏ దేశంలో గుర్తించారు?

జ: జపాన్

 1. మనదేశంలో అత్యధికంగా టైగర్ రిజర్వ్‌లు ఉన్న రాష్ట్రం ఏది?

జ: మధ్యప్రదేశ్

 1. భారతదేశానికిసంబంధించిన కింది ఏ ప్రాంతంలో మడ అడవులు అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి?

జ: పశ్చిమ్ బంగ

 1. ప్రపంచంలోఅత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తున్న జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం?

జ: ఖతర్

 1. సల్ఫర్‌డై ఆక్సైడ్ వల్ల కలిగే కాలుష్యానికి ప్రధాన సూచికగా కింది ఏ జీవులను పేర్కొనవచ్చు?

జ: లైకెన్లు

 1. కిందివాటిలోపర్యావరణంలోకర్బన వలయానికి, కార్బన్ డై ఆయాక్సైడ్ ప్రవేశానికి సంబంధమున్న అంశాలు ఏవి?
 2. i)కిరణజన్యసంయోగక్రియ    ii) శ్వాసక్రియ   iii) కర్బన పదార్థాల విచ్ఛిత్తి    iv) అగ్ని పర్వతాల విస్ఫోటనం

జ: ii, iii, iv మాత్రమే

గజ యాత్ర 2017

¤ ఇది దేశవ్యాప్తంగా సుమారు 12 ఎలిఫెంట్ రేంజ్ రాష్ట్రాల్లో ఏనుగుల సంరక్షణార్థం నిర్వహించిన ప్రచార యాత్ర

¤ ఇందులో భాగంగా కళాకారులు ఏనుగులకు సంబంధించిన కళా రూపాలతో పర్యటిస్తారు

¤ గజు మస్కట్ (Gaju Mascot) ఈ యాత్రకు చుక్కానిలా వ్యవహరించనుంది.

¤ ఈ కార్యక్రమం వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (WTI) ఆధ్వర్యంలో సుమారు 15 నెలలు కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *